Israel-Lebanon-

Israel-Lebanon: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొంత తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో పరిస్థితులు చక్కబడుతున్నట్లే అనిపిస్తున్నాయి. కాల్పుల విరమణ ప్రకటించగానే లెబనాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అయితే ఒప్పందం తాత్కాలికమే కావడంతో క్షేత్రస్థాయిలో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్‌లో 10 కిలోమీటర్ల భద్రతా మండలం కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు.

ఇదిలా ఉండగా, కాల్పుల విరమణ అమల్లోకి రావడానికి ముందు ఇరుపక్షాలు భారీ దాడులు జరిపాయి. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌లో వందలాది లక్ష్యాలపై దాడి చేసినట్లు ప్రకటించింది. మరోవైపు, లెబనాన్ భూభాగంలో ఇజ్రాయెల్ ఉనికిని అంగీకరించబోమని హిజ్బుల్లా స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ పూర్తిగా వెనక్కి వెళ్లకపోతే శాంతి సాధ్యం కాదని ఇరాన్ కూడా అభిప్రాయపడుతోంది. ఈ 10 రోజుల కాల్పుల విరమణలో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది. ఎలాంటి ఘర్షణలు జరగకపోతే దీర్ఘకాలిక శాంతి సాధ్యమవుతుంది, లేకపోతే పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. కాల్పుల ఒప్పందంపై సంతకాలు చేసేందుకు ఇరుదేశాల నాయకులను వైట్‌హౌస్‌కు రావాలని ట్రంప్ ఆహ్వానించారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…

ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..

External Links:

ఇజ్రాయెల్‌తో 10 రోజులు కాల్పుల విరమణ ఒప్పందం.. లెబనాన్‌లో సంబరాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *