Tensions Rise Again: ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధమవుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక అరేబియా సముద్రంలో మోహరించింది. ఇప్పుడు యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్. ఫోర్డ్‌ను కరేబియన్ నుంచి మధ్యప్రాచ్యానికి తరలించేందుకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అబ్రహం లింకన్‌తో పాటు గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్లు కూడా మోహరించాయి.
ఇదే సమయంలో ఇరాన్‌తో అణు ఒప్పందంపై అమెరికా చర్చలు కొనసాగిస్తోంది. ట్రంప్ త్వరలో ఒప్పందం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసినా, చర్చలు విఫలమైతే సైనిక చర్యలకు సిద్ధమని సంకేతాలు ఇస్తున్నారు. ఇటీవల ఒమన్‌లో పరోక్ష చర్చలు జరిగినా ఫలితం రాలేదు. ఇరాన్ మాత్రం ఒత్తిడికి తలొగ్గమని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ట్రంప్‌ను వైట్‌హౌస్‌లో కలిసి చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. పరిస్థితులు ఎటు దిశగా వెళ్తాయో అన్న ఆందోళన పెరుగుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
ఇరాన్‌లో టెన్షన్.. టెన్షన్.. చుట్టుముడుతోన్న అమెరికా సైన్యం