Pawan Kalyan Writes letter To Telangana Cm: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తూ, పోక్సో చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేసి చిన్నారులపై లైంగిక నేరాలను అరికట్టేందుకు పలు కీలక సూచనలు చేశారు. షాబాద్ ఘటనను ప్రస్తావిస్తూ, పోక్సో కేసుల్లో నిందితులకు బెయిల్ మంజూరుపై కఠిన నిబంధనలు ఉండాలని, బాధితులు మరియు వారి కుటుంబాలకు భద్రత కల్పించాలని కోరారు. అలాగే దర్యాప్తు అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, వైద్య పరీక్షలను 24 గంటల్లో పూర్తి చేయడం, ఫోరెన్సిక్, డీఎన్‌ఏ నివేదికలను త్వరగా అందుబాటులోకి తీసుకురావడం, కేసుల దర్యాప్తు, ఛార్జిషీట్లను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.
ప్రతి పోక్సో కేసులో బాధితుల రక్షణ ప్రణాళిక ఉండాలని, అవసరమైతే పోలీసు భద్రత కల్పించాలని పవన్ ప్రతిపాదించారు. రాష్ట్రవ్యాప్తంగా పోక్సో కేసుల కోసం ఒకే విధమైన SOP అమలు చేయడంతో పాటు ప్రత్యేక మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు చేయాలని, పోలీసు, ప్రాసిక్యూషన్, మహిళా-శిశు సంక్షేమ శాఖలు కలిసి సమీక్షలు నిర్వహించాలని కోరారు. అలాగే పోక్సో కేసుల్లో ఆలస్యం చేయకుండా వెంటనే FIR నమోదు చేయాలని, నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలు, హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు, ప్రార్థనా మందిరాల్లో తప్పనిసరి రిపోర్టింగ్ వ్యవస్థ అమలు చేసి, 30 రోజుల్లో కార్యాచరణ నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ కోరారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..