Prabhas Fauzi Release Date Out: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పిరియాడిక్ యాక్షన్ చిత్రం ‘ఫౌజీ’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా చిత్ర బృందం “అజ్ఞాత పర్వం ముగిసింది.. తిరుగుబాటు మొదలైంది” అంటూ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 3, 2026న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
రిలీజ్ డేట్‌తో పాటు విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రక్తపు మరకలతో, సైనికుడి గెటప్‌లో ప్రభాస్ కనిపించగా, యుద్ధ నేపథ్యం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా నటిస్తున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో ప్రభాస్ మరో భారీ విజయాన్ని అందుకుంటాడా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్‌లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే