Ap Telangana Weather Rain Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై ఉపరితల ద్రోణులు, ఆవర్తనాల ప్రభావం కొనసాగుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతుండగా, దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో ఏపీలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30–40 కి.మీ వేగంతో, గరిష్ఠంగా 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నా, అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో రాత్రి ఉష్ణోగ్రతలు 18–20 డిగ్రీలకు పడిపోయాయి. పొగమంచు కూడా పెరగడంతో వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని జాగ్రత్తగా ప్రయాణిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో అక్కడ చల్లటి వాతావరణం నెలకొంది. దీంతో వంజంగి, మేఘాలకొండ వంటి ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..
External Links:
ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన