Heavy Rains in Telangana

Rain Thunderstorms And Strong Winds: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతూ మయన్మార్‌, బంగ్లాదేశ్‌ వైపు కదులుతోంది. దీని ప్రభావంతో మిజోరం, త్రిపురలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్‌ 1 నుంచి 3 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ సాధారణంగా పొడి వాతావరణం కొనసాగనుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండు, మూడు రోజుల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవచ్చని తెలిపింది. ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..

External Links:

ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *