బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడి, శనివారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని దీని ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇది తుపానుగా మారి, ఈ నెల 27న తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకనుందని వెల్లడించారు. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో మంగళ, బుధ వారాల్లో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అయితే పలు జిల్లాల్లో వరి కోతల సీజన్ ప్రారంభం కావడంతో ప్రత్యేకించి వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. విపత్కర పరిస్థితులను రైతులు ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. వరి కోతలు, వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా వెల్లడించారు .

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *