Telangana Heatwave Red Alert: తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలోని 18కి పైగా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌లో కూడా 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర, తూర్పు జిల్లాల్లో వడగాలులు ఎక్కువగా ఉన్నాయి. వడదెబ్బ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 34 మంది మృతి చెందారు. దీంతో ప్రజలు అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
హీట్ స్ట్రోక్ అనేది డీహైడ్రేషన్ వల్ల వచ్చే తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇది హీట్ ఎగ్జాషన్, హీట్ ఇంజురీ, హీట్ స్ట్రోక్ అనే మూడు రకాలుగా ఉంటుంది. ఎక్కువ వేడి వల్ల అలసట, కండరాల నొప్పులు, కిడ్నీ, గుండె సమస్యలు రావచ్చు. తీవ్రమైన పరిస్థితిలో మెదడు పనితీరు దెబ్బతిని కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. దీనిని నివారించాలంటే ఎక్కువగా నీరు, ద్రవపదార్థాలు తీసుకోవాలి. ఓఆర్‌ఎస్, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి వాటిని తాగాలి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు బయటకు వెళ్లకపోవడం మంచిది. తేలికపాటి లేత రంగు దుస్తులు ధరించాలి. పుచ్చకాయ, దోసకాయ వంటి పండ్లు తీసుకోవడం కూడా శరీరానికి మేలు చేస్తుంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
విషపూరితంగా మారిన కిడ్స్ సిరప్..
SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.
External Links:
షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త