Telangana Rain Alert Thunderstorms

Telangana Rain Alert Thunderstorms: తెలంగాణలో ఎండలు తీవ్రంగా ఉండటంతో పాటు వాతావరణంలో అకస్మిక మార్పులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. రానున్న రెండు గంటల్లో వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో కూడా సాయంత్రం సమయంలో తేలికపాటి వర్షం కురిసే సూచనలు ఉన్నాయి. దీంతో ప్రజలు వేడి నుంచి ఉపశమనం వస్తుందని ఆశిస్తున్నారు.

కానీ నిపుణులు చెబుతున్నదేమిటంటే ఈ వర్షాలు తాత్కాలికంగా గాలిలో తేమను మాత్రమే పెంచుతాయి, వేడి మాత్రం తగ్గదు. వర్షం తర్వాత హ్యూమిడిటీ పెరగడంతో ఉక్కపోత మరింత ఎక్కువగా అనిపిస్తుంది. అంటే ఎండ తగ్గకపోగా, అసౌకర్యం ఇంకా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, బయట ఉన్నవారు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

విషపూరితంగా మారిన కిడ్స్ సిరప్..

SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.

External Links:

రాబోయే 2 గంట్లలో తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *