Tet Application Dates Exam Schedule: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం TGTET-In-Service Teachers-2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలన్నా, ప్రమోషన్లు పొందాలన్నా టెట్ అర్హత తప్పనిసరి. అందుకే సాధారణ టెట్ పరీక్షలతో పాటు ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, లోకల్ బాడీ, TGREIS, సంక్షేమ నివాస పాఠశాలలు, మోడల్ స్కూల్స్, ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ టీచర్లు మాత్రమే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ టెట్ అర్హత భవిష్యత్తులో జరిగే DSC లేదా ఇతర ప్రత్యక్ష నియామకాలకు వర్తించదు.
ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత (CBT) విధానంలో రెండు పేపర్లుగా జరుగుతుంది. 1 నుంచి 5 తరగతులకు బోధించే వారు పేపర్-1, 6 నుంచి 8 తరగతులకు బోధించే వారు పేపర్-2 రాయాలి. ప్రతి పేపర్‌లో 150 ప్రశ్నలు ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ ఉండదు. దరఖాస్తులు జులై 22 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. హాల్ టికెట్లు ఆగస్టు 31 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలు సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు నిర్వహించి, ఫలితాలను సెప్టెంబర్ 28 నుంచి 30 మధ్య ప్రకటించనున్నారు. సందేహాల కోసం విద్యాశాఖ హెల్ప్‌డెస్క్ నంబర్లను కూడా అందుబాటులో ఉంచింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!