Tg Eapcet Counselling 2026

Tg Eapcet Counselling 2026: తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎప్‌సెట్ (TG EAPCET) మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 19 నుంచి జూలై 14 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు జూన్ 19 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ జూన్ 22 నుంచి 29 వరకు జరుగుతుంది.

సర్టిఫికెట్ల పరిశీలన పూర్తైన తర్వాత విద్యార్థులు జూన్ 25 నుంచి జూలై 1 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. జూలై 4న మాక్ సీట్ అలాట్‌మెంట్ విడుదల చేస్తారు. అనంతరం అవసరమైతే జూలై 5 నుంచి 7 వరకు వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. మొదటి విడత అధికారిక సీట్ల కేటాయింపు జూలై 10న ప్రకటిస్తారు. సీటు పొందిన విద్యార్థులు జూలై 10 నుంచి 14 లోపు ట్యూషన్ ఫీజు చెల్లించి, ఆన్‌లైన్ ద్వారా కాలేజీలో రిపోర్ట్ చేయాలి.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

విషపూరితంగా మారిన కిడ్స్ సిరప్..

SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.

External Links:

విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *