Jr Ntr Birthday Special: ఎన్టీఆర్ ఎంత బిజీగా ఉన్నా తన కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయిస్తుంటారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ఇంటికి రెండు కొత్త మకావ్ జాతి పక్షులను తీసుకొచ్చారు. నెరిసిన గడ్డం, స్లీవ్‌లెస్ టీషర్టుతో రగ్గడ్ లుక్‌లో కనిపించిన తారక్.. ఆ పక్షులతో సరదాగా గడుపుతున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక పక్షి ఆయన చేతిపై కూర్చుంటే, మరోటి పక్కనే కనిపించింది.
ఈ పక్షులకు ఎన్టీఆర్ ‘అసాహి’, ‘యూహి’ అనే జపనీస్ పేర్లు పెట్టారు. జపనీస్‌లో ‘అసాహి’ అంటే సూర్యోదయం, ‘యూహి’ అంటే సూర్యాస్తమయం అని అర్థం. జపాన్ దేశం, అక్కడి సంస్కృతిపై తనకు ఉన్న అభిమానంతోనే ఈ పేర్లు పెట్టినట్లు తారక్ తెలిపారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్ల సమయంలో జపాన్ ప్రేక్షకులతో ఎన్టీఆర్‌కు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు అదే అనుబంధాన్ని తన కొత్త పెట్స్ ద్వారా గుర్తు చేసుకున్నట్లు అభిమానులు భావిస్తున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
ఎన్టీఆర్ ఇంట్లోకి కొత్త అతిథులు.. జపాన్ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసా?