Peddi Pre-Release Event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలను మరింత పెంచేలా నేడు విజయవాడలో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుక ఘనంగా జరగనుంది.
ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సనతో పాటు చిత్ర బృందం మొత్తం హాజరుకానుంది. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకే వేదికపై పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌లను చూడాలని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈవెంట్‌లో సెకండ్ ట్రైలర్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ వేడుక కోసం అనేక ప్రాంతాల నుంచి మెగా అభిమానులు విజయవాడకు చేరుకుంటున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
నేడే బెజవాడలో రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బ్యాటింగ్..