Womens T20 World Cup 2026 Semi Finals: మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. లీడ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 113 పరుగుల తేడాతో ఓడించి వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసి సెమీఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులు చేసింది. ఎల్లీస్ పెర్రీ అద్భుతంగా 71 పరుగులు చేయగా, జార్జియా వోల్ 39 పరుగులతో రాణించింది. చివర్లో నికోలా క్యారీ వేగంగా 26 పరుగులు చేసి జట్టు స్కోరును 199కు చేర్చింది.
200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 13.4 ఓవర్లలో 86 పరుగులకే ఆలౌటైంది. మునీబా అలీ 32 పరుగులతో పోరాడినా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో సోఫీ మోలినెక్స్, అన్నాబెల్ సదర్లాండ్, ఎల్లీస్ పెర్రీ తలా 2 వికెట్లు తీశారు. బ్యాటింగ్‌లో 71 పరుగులు, బౌలింగ్‌లో 2 వికెట్లు సాధించిన ఎల్లీస్ పెర్రీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ ఓటమితో పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించగా, ఆస్ట్రేలియా తన తదుపరి మ్యాచ్‌లో భారత మహిళల జట్టుతో తలపడనుంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!