India Vs Afghanistan T20 Series 2026

India Vs Afghanistan T20 Series 2026: భారత క్రికెట్ జట్టు సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ప్రత్యేకత ఏమిటంటే.. మ్యాచ్‌లు భారత్‌లో జరిగినప్పటికీ, ఈ సిరీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) అధికారిక ఆతిథ్యం ఇవ్వనుంది. భద్రతా కారణాల వల్ల ఆఫ్ఘనిస్తాన్ తమ స్వదేశీ మ్యాచ్‌లను కొన్నేళ్లుగా భారత్‌లో నిర్వహిస్తుండగా, భారత్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. శ్రీలంక టెస్టు సిరీస్ అనంతరం జరిగే ఈ సిరీస్ ఆసియా క్రీడలకు ముందు టీమిండియాకు కీలక సన్నాహకంగా మారనుంది.

ఇటీవల వన్డే సిరీస్‌లో భారత్ ఆఫ్ఘనిస్తాన్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయగా, టెస్టులో కూడా భారీ విజయం సాధించింది. ఈసారి టీ20ల్లో బలంగా రాణించాలని ఆఫ్ఘనిస్తాన్ లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, ఇటీవల వైట్‌బాల్ క్రికెట్‌లో వరుస పరాజయాలతో ఒత్తిడిలో ఉన్న టీమిండియాకు ఈ సిరీస్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడంతో పాటు సరైన జట్టు కూర్పును ఖరారు చేసుకునేందుకు మంచి అవకాశంగా భావిస్తున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్ గడ్డపై టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనున్న ఆఫ్ఘనిస్థాన్.. పూర్తి షెడ్యూల్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *