PEDDI Tickets: రామ్ చరణ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండటంతో సోషల్ మీడియాలో భారీ హైప్ ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఇచ్చింది. జూన్ 3 రాత్రి 8 గంటల నుంచి ప్రీమియర్ షోలు ప్రారంభం కానుండగా, ఒక్కో టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.600గా నిర్ణయించారు. అలాగే జూన్ 4 నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 అదనంగా వసూలు చేసుకునే అవకాశం కల్పించింది. రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇక తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై ఇంకా స్పష్టత రాలేదు. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య కొనసాగుతున్న వివాదం కారణంగా నిర్ణయం ఆలస్యం కావచ్చని సమాచారం. టికెట్ ధరలపై నిర్ణయం వచ్చిన తర్వాతే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ‘U/A’ సర్టిఫికేట్ పొందింది. సుమారు 3 గంటల 9 నిమిషాల రన్‌టైమ్‌తో రానున్న ఈ సినిమాను ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు గ్రామీణ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. 1980ల గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలు కూడా ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
‘పెద్ది’ ప్రీమియర్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఒక్క టికెట్ ధర ఎంతంటే?