Jana Nayagan Review: కోలీవుడ్ స్టార్ విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ఓవర్సీస్ ప్రీమియర్స్, తొలి షోల నుంచి మిశ్రమం కంటే ఎక్కువగా నిరాశాజనక స్పందన వస్తోంది. బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాకు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో ప్రారంభంలోని కొన్ని మాస్ ఎలివేషన్ సీన్లు, ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రమే ఆకట్టుకుంటాయి. విజయ్ స్క్రీన్ ప్రజెన్స్, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు కొంత బలం ఇచ్చాయి.
అయితే కథను ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు హెచ్. వినోద్ విఫలమయ్యారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కుమార్తె సెంటిమెంట్‌ను బలంగా చూపించకపోవడంతో ఎమోషన్ పండలేదు. విలన్‌గా నటించిన బాబీ డియోల్ పాత్ర కూడా ఆశించిన స్థాయిలో లేదు. వీఎఫ్ఎక్స్, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బలహీనంగా కనిపించాయి. చాలా సన్నివేశాలు సరైన ఫ్లో లేకుండా సాగడం, క్లైమాక్స్ కూడా ఆకట్టుకోకపోవడంతో, మొత్తం మీద విజయ్ నటన, అనిరుధ్ సంగీతం ఉన్నప్పటికీ ‘జన నాయగన్’ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
విజయ్ ‘జననాయకుడు’ ఓవర్సీస్ రివ్యూ.. వద్దు బ్రో