Ram Charan Peddi Movie

Ram Charan Peddi Movie: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాపై ఓవర్సీస్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు యూట్యూబ్‌లో మంచి స్పందన పొందుతున్నాయి. ఇప్పుడు అమెరికాలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. తాజా ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల ప్రీ-సేల్స్ ఇప్పటికే హాఫ్ మిలియన్ డాలర్లు దాటాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే ప్రీమియర్ షోలతోనే సినిమా వన్ మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్లుగా నిలిచాయి. ముఖ్యంగా శృతి హాసన్ కనిపించిన ‘హెల్లాళ్ళల్లో’ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

రిలీజ్‌కు ముందే నార్త్ అమెరికాలో.. ‘పెద్ది’ రికార్డ్ హంగామా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *