Ramani Kalyanam Movie: ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న కొత్త సినిమా ‘రమణి కళ్యాణం’. కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్‌పై సూర్య వశిష్ట, దీప్షిక ప్రధాన పాత్రల్లో విజయ్ ఆదిరెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను నటి జయసుధ విడుదల చేశారు. ఈ సినిమాలో హీరో వీల్‌చైర్‌కే పరిమితమైన యువకుడి పాత్రలో నటిస్తుండగా, హీరోయిన్ అంధురాలి పాత్రలో కనిపించనుంది. ఇద్దరి పాత్రలు కూడా చాలా ప్రత్యేకంగా, ఛాలెంజింగ్‌గా ఉంటాయని చిత్రబృందం తెలిపింది.
హీరో సూర్య వశిష్ట మాట్లాడుతూ ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పారు. వీల్‌చైర్‌లో నటించడం తనకు కొత్త అనుభవమని తెలిపారు. హీరోయిన్ దీప్షిక అంధురాలి పాత్రలో నటించడం ఒక సవాల్‌గా అనిపించిందని, ఈ సినిమా ప్రేక్షకులకు ఆశను ఇస్తుందని చెప్పారు. దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి మాట్లాడుతూ మంచి కథ, డైలాగ్స్‌తో ఈ సినిమాను ప్యాషన్‌తో తెరకెక్కించామని తెలిపారు. నిర్మాత శ్రీనాథ్ పసుపులేటి, జయసుధ ప్రశంసలు తమకు మరింత ఉత్సాహం ఇచ్చాయని అన్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
వీల్‌చైర్‌లో హీరో.. అంధురాలిగా హీరోయిన్..