Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శంభాజీ మహారాజ్ భారత చరిత్రలో ధైర్యం, త్యాగానికి ప్రతీకగా నిలిచారు. ఆయన మే 14, 1657న పురందర్ కోటలో శివాజీ మహారాజ్, సాయిబాయి దంపతులకు జన్మించారు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన శంభాజీని జిజాబాయి పెంచారు. 1681లో మరాఠా సామ్రాజ్య సింహాసనం అధిష్టించిన ఆయన, తన తండ్రి శివాజీ ఆశయమైన హిందవీ స్వరాజ్యాన్ని కాపాడేందుకు పోరాడారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చి మరాఠా సామ్రాజ్యాన్ని బలంగా నిలబెట్టారు. యుద్ధ వీరుడిగానే కాకుండా అనేక భాషల్లో పాండిత్యం కలిగిన నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు.
1689లో ఔరంగజేబు శంభాజీని బందీగా పట్టుకుని ఇస్లాంలోకి మారాలని తీవ్రంగా హింసించాడు. కానీ శంభాజీ తన విశ్వాసాన్ని వదులుకోకుండా ధైర్యంగా నిలబడ్డారు. చివరకు మార్చి 11, 1689న మొఘలులు ఆయనను హత్య చేశారు. ఆయన జీవితం దేశభక్తి, ధైర్యం, క్రమశిక్షణకు గొప్ప ఉదాహరణగా నిలిచింది. ప్రస్తుతం ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం శంభాజీ వీరగాథను కొత్త తరానికి పరిచయం చేసింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..