Rj Balaji Cries In Theatre

Rj Balaji Cries In Theatre: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) సినిమా మే 15న థియేటర్లలో విడుదలై మంచి స్పందన పొందింది. ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా విడుదలకు ముందు అనేక ఆర్థిక సమస్యలు, షో క్యాన్సిలేషన్లు, పైరసీ భయాలు ఎదుర్కొంది. అయినప్పటికీ సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడంతో చిత్ర బృందం ఆనందంలో మునిగిపోయింది. చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్స్ థియేటర్లో ప్రేక్షకుల ఈలలు, అరుపులు చూసి దర్శకుడు ఆర్‌జే బాలాజీ భావోద్వేగానికి లోనయ్యారు.

సినిమా ముగిసిన తర్వాత అభిమానులు బాలాజీ పేరును నినదించడంతో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది చూసిన హీరోయిన్ త్రిష వెంటనే ఆయనను హగ్ చేసుకుని ఓదార్చారు. ఈ సమయంలో సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్, హీరో కార్తీ కూడా అక్కడే ఉన్నారు. ప్రస్తుతం ఈ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “దర్శకుడికి ఇంతకంటే పెద్ద విజయం ఉండదు” అంటూ అభిమానులు ఈ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *