Suriya Veera Bhadrudu: తమిళ స్టార్ హీరో సూర్య, హీరోయిన్ త్రిష కృష్ణన్ కలిసి నటించిన యాక్షన్ డ్రామా ‘వీరభద్రుడు’ (తమిళంలో ‘కరుప్పు’) గత శుక్రవారం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళం, తెలుగులో మొదటి వీకెండ్‌లో భారీ వసూళ్లు సాధించింది. విడుదలకు ముందు కొన్ని ఆర్థిక సమస్యలు ఎదురైనా, థియేటర్లలో విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత సూర్య-త్రిషల కెమిస్ట్రీ, ఆర్‌జే బాలాజీ స్క్రీన్‌ప్లే, సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి.
అయితే ఇప్పుడు ఈ సినిమాకు అసలైన పరీక్ష మొదలైంది. సాధారణంగా వీకెండ్‌లో ఫ్యాన్స్ కారణంగా సినిమాలకు మంచి కలెక్షన్లు వస్తాయి. కానీ సినిమా దీర్ఘకాలం విజయవంతంగా నడవాలంటే సోమవారం కలెక్షన్లు చాలా ముఖ్యమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ‘వీరభద్రుడు’ సూర్యకు మంచి కంబ్యాక్ మూవీగా ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమాలు లేకపోవడం కూడా ఈ చిత్రానికి కలిసి వస్తోంది. సోమవారం కూడా మంచి బుకింగ్స్, కలెక్షన్లు కొనసాగితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయంగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
‘వీర భద్రుడు’కు అసలు పరీక్ష ఇదే…