Prabhas Fauji release date: ఈ ఏడాది సంక్రాంతికి ‘రాజా సాబ్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ప్రభాస్, ఏడాది చివర్లో మరో సినిమాతో రానున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమాను డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూవీ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
‘ఫౌజీ’ ఒక అద్భుతమైన విజువల్ మూవీగా ఉండబోతోందని చిత్ర బృందం చెబుతోంది. ఇందులో ప్రభాస్‌ను ఇంతకు ముందు చూడని పవర్‌ఫుల్ పాత్రలో చూపించనున్నారని తెలిపారు. ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భానుచందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టీ-సిరీస్ సమర్పణలో, మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఫౌజీ రిలీజ్ డేట్ ఫిక్స్..!