Veteran actor Bhagyaraj passed away: ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు, కథా రచయిత కె. భాగ్యరాజ్ (73) గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. ఇటీవల గోవాలో జరిగిన నటి ఖుష్బూ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన ఆయన ఆకస్మిక మరణం సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టింది. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో జన్మించిన భాగ్యరాజ్, ప్రముఖ దర్శకుడు భారతీరాజా వద్ద సహాయ దర్శకుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించి, అనంతరం దర్శకుడు, కథా రచయిత, నటుడిగా భారతీయ సినీ రంగంలో చెరగని ముద్ర వేశారు. మధ్యతరగతి కుటుంబాల భావోద్వేగాలు, సహజమైన సంభాషణలు, జీవితానికి దగ్గరైన కథలతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు.

1980, 1990 దశకాల్లో తమిళ సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన దర్శకుల్లో ఒకరిగా నిలిచిన భాగ్యరాజ్, 25కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించగా, 75కిపైగా సినిమాల్లో నటించారు. ముందానై ముడిచ్చు, అంధా 7 నాట్కల్, డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్ వంటి చిత్రాలు ఆయనకు చిరస్థాయి గుర్తింపును తీసుకొచ్చాయి. తెలుగులో కుబేర, 35, సీత, రెడ్ అలర్ట్, మేం వయసుకు వచ్చాం వంటి చిత్రాల్లో నటించారు. హిందీలో ఆఖ్రీ రాస్తా చిత్రానికి దర్శకత్వం వహించి ఘన విజయాన్ని అందుకున్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు ఎంజీఆర్‌ సినీ రంగంలో తన వారసుడిగా ప్రశంసించడం విశేషం. భాగ్యరాజ్‌కు భార్య పూర్ణిమ భాగ్యరాజ్, కుమారుడు శంతను భాగ్యరాజ్, కుమార్తె శరణ్య ఉన్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

 తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…

External Links:

ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్‌ కన్నుమూత

By Anusha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *