Coimbatore Girl Murder Case

Coimbatore Girl Murder Case: తమిళనాడులో కోయంబత్తూరులో జరిగిన చిన్నారి అత్యాచారం, హత్య ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రజలు, ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఘటనపై మీడియాతో మాట్లాడిన ఓ మహిళా పోలీస్ అధికారి నవ్వుతూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే మహిళా మంత్రులు కూడా చిరునవ్వులతో కనిపించడం ప్రజల్లో మరింత ఆగ్రహాన్ని పెంచింది.

ఇదిలా ఉండగా, బాధితురాలి తల్లి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. తన కుమార్తె మృతదేహాన్ని చివరిసారి కూడా చూడనీయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పోస్ట్‌మార్టం తర్వాత కుటుంబ సభ్యులకు తెలియకుండా మృతదేహాన్ని తీసుకెళ్లి దహనం చేశారని ఆరోపించింది. ఈ ఆరోపణలతో ప్రభుత్వం, పోలీసుల వైఖరిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారగా, ప్రభుత్వం ఇకపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్న ఆసక్తి నెలకొంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

నిదా ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు…

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్..

External Links:

సంచలనంగా మారిన కోయంబత్తూరు ఘటన.. విజయ్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *