Dk Shivakumar

Dk Shivakumar: కర్ణాటకలో నేడు కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుంది. రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ సాయంత్రం 4.05 గంటలకు బెంగళూరులోని లోక్ భవన్ గ్లాస్ హౌస్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 10 మందికి పైగా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. జి. పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు చేశారు. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు హాజరుకానుండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజలు కార్యక్రమాన్ని వీక్షించేందుకు పలు ప్రాంతాల్లో LED స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టే ముందు డీకే శివకుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. నేడు ప్రమాణ స్వీకారం చేసే వారిలో జి. పరమేశ్వర, కె.జె. జార్జ్, ఎం.బి. పాటిల్, ప్రియాంక్ ఖర్గే, సతీష్ జార్కిహోళి, రామలింగారెడ్డి, కె.హెచ్. మునియప్ప, దినేష్ గుండూ రావు తదితరులు ఉన్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

నిదా ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు…

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్..

External Links:

కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *