NEET UG Result 2026: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET UG 2026 ఫలితాలను విడుదల చేసింది. జూన్ 21న జరిగిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా, విదేశాల్లో కలిపి సుమారు 20 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా, 11.21 లక్షల మంది అర్హత సాధించారు. పరీక్షలో క్వాలిఫై అయిన వారు MBBS, BDS, AYUSH తదితర ఆరోగ్య కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులు. అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్‌ను neet.nta.nic.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ లేదా రోల్ నంబర్‌తో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈసారి అర్హత సాధించిన వారిలో 58 శాతానికి పైగా బాలికలే ఉన్నారు. అలాగే 138 మంది విద్యార్థులు 690కి పైగా మార్కులు సాధించగా, ఎక్కువ మంది మొదటిసారి పరీక్ష రాసిన 17 నుంచి 19 ఏళ్ల వయస్సు వారే.
ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా 1.7 లక్షలకు పైగా విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. తెలంగాణకు చెందిన వీరయ్యగారి సహ్యు ఆలిండియా 13వ ర్యాంకు సాధించగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నామాల ప్రేరణ 36వ ర్యాంకు సాధించారు. రెండు రాష్ట్రాల నుంచి మరికొందరు విద్యార్థులు కూడా టాప్ ర్యాంకులు పొందారు. ఫలితాలు విడుదల కావడంతో మెడికల్ కాలేజీల అడ్మిషన్లు, కౌన్సెలింగ్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుందని NTA తెలిపింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్‌కార్డ్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి