Pm Modi Plays Football

Pm Modi Plays Football: ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం సిక్కింకు వెళ్లారు. అక్కడికి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. గ్యాంగ్‌టక్‌లోని ఆర్కిడేరియంను సందర్శించిన తర్వాత, పాల్జోర్ స్టేడియంలో జరుగుతున్న సిక్కిం రాష్ట్ర ఆవిర్భావ 50వ వార్షికోత్సవ ముగింపు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కార్యక్రమానికి ముందు మోడీ క్రీడా మైదానంలో యువతతో కలిసి కొద్దిసేపు ఫుట్‌బాల్ ఆడారు.

ఈ ఫుట్‌బాల్ ఆటకు సంబంధించిన ఫొటోలను మోడీ ఎక్స్‌లో పంచుకుని, “గ్యాంగ్‌టక్‌లో ఒక ఆహ్లాదకరమైన ఉదయం, చిన్న స్నేహితులతో ఫుట్‌బాల్ ఆడటం చాలా ఆనందంగా ఉంది” అని తెలిపారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా రూ. 4,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేయనున్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

నిదా ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు…బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్..

External Links:

క్రీడాకారులతో కలిసి ఫుట్‌బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *