Up Lpg Tanker Explosion: ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో ఎల్‌పీజీ (LPG) ట్యాంకర్ టోల్ బూత్‌ను ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. నియంత్రణ కోల్పోయిన ట్యాంకర్ డివైడర్‌ను ఢీకొని టోల్ ప్లాజాలోకి దూసుకెళ్లింది. వెంటనే ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. జూన్ 26న ఉదయం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన 24 సెకన్ల సీసీటీవీ వీడియో తాజాగా బయటకు వచ్చింది. పేలుడు తర్వాత నల్లటి పొగ వ్యాపించగా, మంటలు రెండు కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపించాయి.
ప్రమాదం జరిగిన వెంటనే జిల్లాలోని ఫైర్ బ్రిగేడ్ బృందాలు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ట్యాంకర్ డ్రైవర్ ధర్మేంద్ర దూబే, టోల్ ప్లాజా ఉద్యోగి ఆలోక్ అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన వారిలో మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా కొంతసేపు టోల్ ప్లాజా వద్ద వాహనాలను ఉచితంగా అనుమతించారు. ప్రమాదానికి కారణాలు, సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై ప్రత్యేక సాంకేతిక బృందం దర్యాప్తు చేస్తోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
నిదా ఖాన్ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు…
బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్..
External Links:
టోల్ బూత్‌ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్