Work From Home: ప్రధాని మోడీ ఇటీవల హైదరాబాద్ పర్యటనలో ఇంధన పొదుపు, ప్రజా రవాణా వినియోగం, వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ మీటింగ్స్ వంటి అంశాలపై సూచనలు చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఐటీ సంస్థలకు తప్పనిసరిగా “వర్క్ ఫ్రమ్ హోమ్” అమలు చేయబోతోందనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తరించింది. అయితే ఈ వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. కంపెనీలకు అలాంటి ఆదేశాలు ఇవ్వాలనే ఆలోచన లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలు కేవలం ఇంధన వినియోగాన్ని తగ్గించి, వనరులను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని చేసిన విజ్ఞప్తి మాత్రమేనని తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరలు, పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా దేశంపై పడే ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు చెప్పారు. ప్రజలు వీలైనప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ మీటింగ్స్ ఉపయోగించి ప్రయాణాలను తగ్గించుకోవాలని సూచించినప్పటికీ, ఇది తప్పనిసరి నిబంధన కాదని స్పష్టం చేశారు. అలాగే రహదారులు, రైల్వేలు, రక్షణ, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులు యథావిధిగా కొనసాగుతున్నాయని, సంక్షేమ పథకాలపై ఎలాంటి కోతలు లేవని తెలిపారు. కొన్ని కంపెనీలు ఖర్చులు తగ్గించేందుకు స్వయంగా వర్చువల్ విధానాలను ప్రోత్సహిస్తున్నాయే తప్ప, అవి ప్రభుత్వ ఆదేశాలు కావని కేంద్రం వెల్లడించింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
నిదా ఖాన్ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు…
బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్..
External Links:
కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..