Ap Cabinet Meeting: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. 40కి పైగా అంశాలపై చర్చించనుండగా, అమరావతి అభివృద్ధికి సంబంధించిన సీఆర్‌డీఏ ప్రతిపాదనలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్‌కు రూ.596 కోట్లు, రాజధాని గ్రామాల మౌలిక వసతులకు రూ.533 కోట్ల కేటాయింపుపై చర్చ జరగనుంది.
అలాగే రహదారులు, తాగునీటి సరఫరా, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్, భూముల అభివృద్ధి, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్ కోసం ల్యాండ్ పూలింగ్ అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. అనంతరం మున్సిపల్ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, సోషల్ మీడియా దుష్ప్రచారం, ఉద్యోగుల సమస్యలపై సీఎం మంత్రులతో చర్చించే అవకాశం ఉంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!