Delhi Tour Meetings With Amit Shah: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో బిజీగా గడపనున్నారు. ఉదయం ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయ్యే సీఎం.. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులు, జలవనరులు, నదుల అనుసంధానం, కేంద్ర సహాయం వంటి అంశాలపై చర్చించనున్నారు. అలాగే రాష్ట్ర భద్రత, పరిపాలన విషయాలపై కూడా అమిత్ షాతో మాట్లాడే అవకాశం ఉంది.
మధ్యాహ్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సీఎం సమావేశమై మౌలిక వసతులు, పెట్టుబడులు, పట్టణాభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించనున్నారు. సాయంత్రం ఢిల్లీలో జరిగే సీఐఐ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొని ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలు, పరిశ్రమలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి వివరించనున్నారు. రాత్రికి ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత సీఎం గౌహతికి బయల్దేరనున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. అమిత్ షా, సీఆర్ పాటిల్‌తో కీలక భేటీలు