Kadiyam Srihari Slams Kcr

Kadiyam Srihari Slams Kcr: స్టేషన్ ఘనాపూర్ మండలం మీదికొండలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ సీఎం కేసీఆర్ మరియు బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తాను బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడే పలు విషయాల్లో సూచనలు ఇచ్చినా, అవి పట్టించుకోలేదన్నారు. వరంగల్ జిల్లాను విభజించవద్దని చెప్పినా, ఆరు భాగాలుగా విభజించి గందరగోళం సృష్టించారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుతో కల్వకుంట్ల కుటుంబానికే ఎక్కువ లాభం జరిగిందని, రాష్ట్రాన్ని వారి ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ఈ విషయాలను కవిత కూడా చెప్పిందని, ఆమె వ్యాఖ్యలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తాను ప్రస్తుతం కాంగ్రెస్‌తో కలిసి నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని కడియం శ్రీహరి తెలిపారు. గతంలో కేసీఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని, రాజీనామా చేయకుండానే వారికి మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. “మీరు చేస్తే రాజకీయాలు, ఇతరులు చేస్తే వ్యభిచారమా?” అని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతి, అహంకారం కారణంగా తాను దూరమయ్యానని, అలాగే ఆయన సొంత కుమార్తె కవిత ఎందుకు దూరమైందో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్‌తో కలిసి అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *