Harish Rao Letter To Cm Revanth Reddy

Harish Rao Letter To Cm Revanth Reddy: రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రి హరీష్‌రావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఎన్నికల సమయంలో చెప్పింది ఒకటి, అధికారంలోకి వచ్చాక చేసేది మరోలా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శించారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులు పరిశీలించాలని, వరి ధాన్యం ఎక్కువగా వస్తున్నా కొనుగోళ్లు ఎందుకు ప్రారంభం కాలేదని ప్రశ్నించారు. మిల్లుల వద్ద తరుగు పేరిట రైతులను నష్టపరుస్తున్నారని, ఎండల్లో రైతులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం స్పందించట్లేదని అన్నారు. సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్‌ను వెంటనే చెల్లించాలని, పొద్దుతిరుగుడు రైతులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

పొద్దుతిరుగుడు పంటలో కేంద్రం కొంత మాత్రమే కొనుగోలు చేయగా, మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేశారు. శనగ రైతులకు సరైన మద్దతు లభించడం లేదని, మద్దతు ధర ఉన్నప్పటికీ ప్రభుత్వం కొనకపోవడంతో తక్కువ ధరలకు అమ్మాల్సి వస్తోందని తెలిపారు. జొన్నలు, మొక్కజొన్న వంటి పంటల కొనుగోళ్లపై కూడా స్పష్టత ఇవ్వాలని, ఎకరాకు పరిమితి నిబంధనలను సడలించాలని కోరారు. అన్ని పంటలను మద్దతు ధరకు వెంటనే కొనుగోలు చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

“వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి”.. సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు లేఖ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *