Konda Murali: తెలంగాణ రాజకీయాల్లో కొండా కుటుంబం పార్టీ మారుతుందంటూ వస్తున్న ప్రచారాలను సీనియర్ నాయకుడు కొండా మురళి ఖండించారు. తాము కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే తమకు ఎంతో గౌరవం, అభిమానం ఉందన్నారు. తన కుమార్తె సుస్మిత చుట్టూ జరుగుతున్న వివాదంతో తనకు సంబంధం లేదని, అది పూర్తిగా ఆమె వ్యక్తిగత వ్యవహారమని తెలిపారు. ఆమె ప్లాన్-ఏలో ఏం మాట్లాడిందో తెలుసని, ప్లాన్-బీలో ఏం చేస్తుందో తనకు ఎలా తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
పార్టీ మార్పుపై మీడియా తొందరపడాల్సిన అవసరం లేదని కొండా మురళి అన్నారు. తాము కాంగ్రెస్‌ను వీడడం లేదని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో జరిగిన భేటీపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. కేవలం యోగక్షేమాలు తెలుసుకోవడానికి మాత్రమే భట్టిని కలిశామని, ఆ సమావేశానికి ఎలాంటి రాజకీయ అర్థాలు లేవని తెలిపారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
కాంగ్రెస్‌ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం