CM Chandrababu

Chandrababu Launches Sanjeevani Programme: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అరకు లోయలో పర్యటించి గిరిజనుల కోసం ‘సంజీవని’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గిరిజనులకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సంజీవని యాప్ ద్వారా తమ ఆరోగ్య వివరాలను ఫోన్‌లోనే తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. మూడు నెలల్లో ఏజెన్సీ ప్రాంతంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేసి, అవసరమైన వైద్య పరీక్షలు అక్కడే చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే మరిన్ని సెల్‌టవర్లు ఏర్పాటు చేసి మొబైల్, ఇంటర్నెట్ కనెక్టివిటీని మెరుగుపరుస్తామని వెల్లడించారు.

గిరిజనుల ఆరోగ్యంతో పాటు వారి ఆదాయం, జీవనోపాధిని పెంచేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు తెలిపారు. అరకు కాఫీకి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చామని, మిరియాలు, వ్యవసాయం, ఉద్యాన పంటలు, స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు. గిరిజనుల కోసం అల్లూరి సీతారామరాజు చేసిన సేవలను గుర్తుచేసిన సీఎం, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వారి ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

 తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…

External Links:

‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *