Ktr Harish Rao Brs Mlas Arrested: మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేటీఆర్‌తో పాటు కొందరు ఎమ్మెల్యేలను బోయినపల్లి పోలీస్ స్టేషన్‌కు, హరీష్ రావుతో పాటు మరికొందరిని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిన్న అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు బయలుదేరగా దామరకుంట వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది.
ఈ ఘటన నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు బయలుదేరారు. హకీంపేట వద్ద పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కాలినడకన బయలుదేరారు. బొల్లారం వద్ద పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వివాదం జరిగింది. ఎర్రవెల్లికి వెళ్తున్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బొల్లారం చౌరస్తా నుంచి ఎర్రవెల్లి వైపు నడుచుకుంటూ వెళ్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
తీవ్ర ఉద్రిక్తత.. హరీష్ రావు, కేటీఆర్‌తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ అరెస్ట్..