Tamil Nadu Election 2026: తమిళనాడులో పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఓటింగ్ ప్రారంభం కాకముందే పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ఓటర్లు చేరడంతో ఉదయం నుంచే భారీగా ఓటింగ్ నమోదైంది. ఉదయం 9 గంటలకు 17.69 శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. వేసవి ఎండల కారణంగా ప్రజలు ముందుగానే వచ్చి ఓటు వేయడంతో పోలింగ్ శాతం పెరిగింది. రాష్ట్రంలో మొత్తం 324 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా, 4,023 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా, వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమయాన్ని మరో రెండు గంటలు పెంచాలని టీవీకే అధినేత విజయ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇదిలా ఉండగా సీఎం ఎంకే స్టాలిన్, ఉదయనిధి, విజయ్ చెన్నైలో ఓటు వేశారు. రజనీకాంత్ తన కుమార్తె సౌందర్యతో కలిసి స్టెల్లా మారిస్ కాలేజీలో ఓటు వేశారు. శృతి హాసన్ ఆల్వార్‌పేట్‌లో, అజిత్ కుమార్ తిరువాన్మియూర్‌లో తమ ఓటు హక్కును వినియోగించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
9 గంటలకే తమిళనాడులో భారీ పోలింగ్.. కారణమిదేనా?