Reventh Reddy warns BJP

Revanth Reddy warns BJP: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ప్రజలు, సామాన్యులు, పేదల పక్షాన నిలిచే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ బీజేపీకి భయపడదని, లాఠీచార్జీలు, తుపాకులు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు. ఢిల్లీలో విద్యార్థులకు మద్దతుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేపట్టిన నిరసనలో పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఇప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కోట్లాది మంది విద్యార్థులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా కొడంగల్‌లో జరిగిన కాంగ్రెస్ ర్యాలీ, ధర్నాలో పాల్గొన్న ఆయన, ప్రతిపక్ష నేతపై పోలీసులు దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. అలాగే బీజేపీ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందంటూ విమర్శలు చేశారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

బ్రిటీషోళ్లను తరిమికొట్టిన పార్టీ కాంగ్రెస్.. మీరెంత : బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *