Fifa World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ గ్రూప్-G తొలి మ్యాచ్‌లో ఈజిప్ట్ చారిత్రాత్మక విజయానికి చాలా దగ్గరగా వెళ్లినా, చివరికి బెల్జియంతో 1-1తో డ్రా చేసుకుంది. సియాటిల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈజిప్ట్ మొదటి అర్ధభాగంలో అద్భుతంగా ఆడింది. మ్యాచ్ 34వ నిమిషంలో మొహమ్మద్ సలాహ్ ఇచ్చిన అద్భుత పాస్‌ను ఇమామ్ అషూర్ గోల్‌గా మలిచాడు. దీంతో ఈజిప్ట్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. 28 ఏళ్ల అషూర్‌కు ఇది అంతర్జాతీయ కెరీర్‌లో తొలి గోల్ కావడం విశేషం. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఈజిప్ట్ ఆధిక్యాన్ని కొనసాగించింది.
రెండో అర్ధభాగం ప్రారంభంలోనే బెల్జియం స్టార్ స్ట్రైకర్ రొమేలు లుకాకు మైదానంలోకి రావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. లుకాకు ఒత్తిడిలో ఈజిప్ట్ డిఫెండర్ మొహమ్మద్ హానీ బంతిని క్లియర్ చేయబోయి పొరపాటున తన సొంత గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. దీంతో బెల్జియం స్కోరు 1-1తో సమం చేసుకుంది. ఆ తర్వాత ఇరు జట్లు గెలుపు గోల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ప్రపంచకప్ చరిత్రలో తొలి విజయాన్ని అందుకోవాలన్న ఈజిప్ట్ ఆశ చివరికి నెరవేరలేదు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
ఉత్కంఠభరిత పోరులో ఈజిప్ట్ పొరపాటు.. ఊపిరి పీల్చుకున్న బెల్జియం.! 1-1తో మ్యాచ్ డ్రా..