Praggnanandhaa Beat Magnus Carlsen: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ నార్వే చెస్ టోర్నమెంట్‌లో ప్రపంచ నెం.1 ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సెన్‌ను మరోసారి ఓడించి సంచలనం సృష్టించాడు. ఓస్లోలో జరిగిన ఈ మ్యాచ్‌లో నల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద్ అద్భుతమైన ఆటతో కార్ల్‌సెన్‌పై విజయం సాధించాడు. ఇప్పటికే ఈ టోర్నమెంట్ మూడో రౌండ్‌లో కార్ల్‌సెన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద్, ఇప్పుడు రీమ్యాచ్‌లో కూడా గెలిచి అతడి స్వదేశంలోనే డబుల్ విజయం నమోదు చేశాడు. మ్యాచ్‌లో 48వ ఎత్తులో కార్ల్‌సెన్ చేసిన తప్పిదాన్ని ప్రజ్ఞానంద్ సద్వినియోగం చేసుకుని విజయాన్ని ఖాయం చేశాడు.
ఈ విజయంతో ప్రజ్ఞానంద్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకున్నాడు. 2022లో కూడా కార్ల్‌సెన్‌ను ఓడించిన అతడు, విశ్వనాథన్ ఆనంద్, పెంట్యాల హరికృష్ణ తర్వాత కార్ల్‌సెన్‌పై విజయం సాధించిన మూడో భారతీయుడిగా నిలిచాడు. మరోవైపు కార్ల్‌సెన్ ఐదో స్థానానికి పడిపోయాడు. ఇదే టోర్నమెంట్‌లో ప్రపంచ ఛాంపియన్ డి. గూకేష్ అలీరెజా ఫిరౌజ్జా చేతిలో ఓడిపోయి చివరి స్థానంలో కొనసాగుతున్నాడు. మహిళల విభాగంలో దివ్య దేశ్‌ముఖ్ కూడా బిబిసారా అస్సౌబాయేవా చేతిలో ఓడిపోవడంతో అగ్రస్థానానికి చేరుకునే అవకాశాన్ని కోల్పోయింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్‌సెన్‌కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..