Again Increased Gold Rates: శుక్రవారం భారీగా తగ్గిన బంగారం ధరలు శనివారం మళ్లీ పెరిగాయి. అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందం తర్వాత బంగారం ధరలు కొంత తగ్గడంతో కొనుగోలుదారులకు ఊరట లభించినా, ఇప్పుడు ధరలు మళ్లీ పెరగడంతో వారు జాగ్రత్తగా గమనిస్తున్నారు. వారాంతంలో బంగారం కొనాలని భావిస్తున్న వారు ముందుగా తమ నగరాల్లోని తాజా ధరలను తెలుసుకోవడం మంచిది.
జూన్ 20న 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.22 పెరిగి హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో గ్రాముకు రూ.14,608గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.13,390గా కొనసాగుతోంది. ఇక వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నగరాల్లో కిలో స్వచ్ఛమైన వెండి ధర రూ.2.55 లక్షలుగా ఉండగా, గ్రాము వెండి ధర సుమారు రూ.255గా ఉంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రూ.14వేలు దాటిన గ్రాము 24K బంగారం…
External Links:
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!