Stock Market Indicates Green: దేశీయ స్టాక్ మార్కెట్‌కు కొత్త ఉత్సాహం వచ్చింది. ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ, ముంబై మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం అన్ని సూచీలు గ్రీన్‌లోనే కొనసాగుతున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచినట్లుగా కనిపిస్తోంది. సెన్సెక్స్ 269 పాయింట్లు పెరిగి 83,652 వద్ద ఉండగా, నిఫ్టీ 65 పాయింట్లు లాభపడి 25,730 వద్ద ట్రేడ్ అవుతోంది.
నిఫ్టీలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, శ్రీరామ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్‌డీబీ ఫైనాన్షియల్, నువోకో విస్టాస్, ఏంజెల్ వన్, 360 వన్ వామ్, సౌత్ ఇండియన్ బ్యాంక్, స్వరాజ్ ఇంజిన్స్, వారీ రెన్యూవబుల్, బయోకాన్, రైల్‌టెల్ వంటి షేర్లు మంచి లాభాలు సాధించాయి. మరోవైపు సిప్లా, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఓఎన్‌జిసి, అపోలో హాస్పిటల్స్, భారతి ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
LG ఎలక్ట్రానిక్స్ షేరు ధర IPO ధర కంటే 51% పెరిగింది..
External Links:
బీఎంసీ ఎగ్జిట్ ఫలితాలు ఎఫెక్ట్.. భారీ లాభాల్లో సూచీలు