Former Pm Gujral Son Loses Rs 7-8 Crore

Former Pm Gujral Son Loses Rs 7-8 Crore: దేశ రాజధాని ఢిల్లీలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. మాజీ ప్రధాని ఇందర్ కుమార్ గుజ్రాల్ కుమారుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నరేష్ కుమార్ గుజ్రాల్ రూ.7.80 కోట్ల మోసానికి గురయ్యారు. సైబర్ నేరగాళ్లు ఆయన ఫోటోతో వాట్సాప్‌లో నకిలీ ఖాతా సృష్టించి, ఆయన సిబ్బందిని నమ్మించారు. అత్యవసరంగా RTGS ద్వారా డబ్బు పంపాలని చెప్పడంతో కోట్ల రూపాయలు మోసగాళ్ల ఖాతాల్లోకి వెళ్లాయి. అయితే అనుమానాస్పద లావాదేవీని ఆయన కుమార్తె దీక్షా గుజ్రాల్ గుర్తించి విషయాన్ని బయటపెట్టారు. వెంటనే కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైబర్ హెల్ప్‌లైన్ 1930 ద్వారా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో దాదాపు రూ.4 కోట్లు ఫ్రీజ్ చేయగలిగారు.

ప్రస్తుతం ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు ఎక్కడికి వెళ్లింది, ఎవరు ఇందులో పాల్గొన్నారు, నకిలీ వాట్సాప్ ఖాతా ఎక్కడి నుంచి నడిపారు అన్న విషయాలను పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించి మిగిలిన డబ్బును తిరిగి పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నరేష్ గుజ్రాల్ చార్టర్డ్ అకౌంటెంట్‌గా, శిరోమణి అకాలీ దళ్ పార్టీ నాయకుడిగా పనిచేశారు. ఆయన మాజీ ప్రధాని ఇందర్ కుమార్ గుజ్రాల్ కుమారుడు కూడా. ప్రస్తుతం ఈ సైబర్ మోసం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రేణు అగర్వాల్ దారుణ హత్య

ఎర్రకోటలో భారీ చోరీ…

External Links:

భార్య చేతిలో మరో భర్త బలి.. ప్రియుడుతో కలిసి..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *