Mother Kills 2 Year Old Son: సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ మహిళ తన ప్రియుడితో కలిసి రెండేళ్ల కుమారుడిని హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కీసరలో నివసిస్తున్న స్వామి–జ్యోతి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. జ్యోతికి పెళ్లికి ముందు నుంచే నవీన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. గత నెల 29న భర్త పనికి వెళ్లిన సమయంలో నవీన్ ఇంటికి వచ్చాడు. ఇద్దరూ కలిసి ఉన్న సమయంలో రెండేళ్ల బాబు హరికృష్ణ ఏడవడంతో కోపానికి గురైన నవీన్, బాబును చంపాలని చెప్పాడు. జ్యోతి కూడా అంగీకరించడంతో ఇద్దరూ కలిసి చిన్నారిని నేలకేసి కొట్టగా, తీవ్ర గాయాలతో అతడు మృతి చెందాడు.
బాబు చనిపోయిన తర్వాత జ్యోతి, ఫిట్స్ రావడంతో మరణించాడని భర్తను నమ్మించింది. దీంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అయితే జ్యోతి ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త ఆమెను ప్రశ్నించగా, ప్రియుడితో కలిసి కుమారుడిని చంపినట్లు ఒప్పుకుంది. దీంతో స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి బాలుడి మృతదేహాన్ని వెలికితీసి మళ్లీ పోస్టుమార్టం నిర్వహించారు. జ్యోతిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న నవీన్ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రేణు అగర్వాల్ దారుణ హత్య
External Links:
భార్య చేతిలో మరో భర్త బలి.. ప్రియుడుతో కలిసి..!