HDFC Bank Scam: దేశంలోని ప్రముఖ ప్రైవేటు బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మరోసారి వివాదంలో నిలిచింది. ఇటీవల బ్యాంక్‌లో జరుగుతున్న కొన్ని విషయాలపై అసంతృప్తితో ఒక ఉన్నత అధికారి రాజీనామా చేయడంతో సంస్థ పనితీరుపై సందేహాలు వచ్చాయి. ఇప్పుడు మహారాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MSRDC) డిపాజిట్లకు సంబంధించిన రూ.45 కోట్ల అదనపు వడ్డీని నేరుగా ఇవ్వకుండా, రోడ్ సేఫ్టీ ప్రచారం ఖర్చులుగా చూపించిన విషయం బయటపడింది. ఈ మొత్తాన్ని కొంతమంది వెండర్ల ద్వారా ఖర్చు చేసినట్లు బ్యాంక్ అంతర్గత విచారణలో తెలిసింది. ఈ వార్తల ప్రభావంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు కూడా దాదాపు 2 శాతం పడిపోయాయి.
ఈ కేసులో బ్యాంక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రవి సంతానం తమ విభాగం ఇందులో పాత్ర పోషించిందని అంగీకరించినట్లు సమాచారం. మార్చి 12న బ్యాంక్ ఆడిట్ కమిటీ విచారణ ప్రారంభించగా, కొద్ది రోజులకే బ్యాంక్ చైర్మన్ అటాను చక్రవర్తి రాజీనామా చేశారు. బ్యాంక్‌లో కొన్ని విధానాలు తన నైతిక విలువలకు సరిపోవడం లేదని ఆయన తెలిపారు. అలాగే ఈ వ్యవహారంపై జరిగిన చర్చల్లో బ్యాంక్ ఎండీ & సీఈఓ శశిధర్ జగదీశన్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం బయటకు రావడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన పెరిగింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రేణు అగర్వాల్ దారుణ హత్య