East Godavari Thief

East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న చిలపనశెట్టి సన్యాసిరావును అనపర్తి పోలీసులు, రాజమహేంద్రవరం క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది కలిసి అరెస్టు చేశారు. పోలవరం జిల్లా గొంతువానిపాలెం గ్రామానికి చెందిన సన్యాసిరావు జూదానికి బానిసై డబ్బుల కోసం చోరీలను వృత్తిగా మార్చుకున్నాడు. 2019 నుంచి రాత్రివేళ తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని బంగారం, వెండి ఆభరణాలు దొంగిలిస్తున్నాడు. అతనిపై ఇప్పటికే 45 చోరీ కేసులు నమోదయ్యాయి. ఐదు కేసుల్లో శిక్ష అనుభవించగా, మరో 20 కేసులు కోర్టుల్లో విచారణలో ఉన్నాయి.

ఇటీవల ఒక చోరీ కేసులో జైలుకు వెళ్లిన సన్యాసిరావు ఈ ఏడాది మార్చి 26న బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే బయటకు వచ్చిన కొద్ది రోజుల్లోనే అనపర్తి, కోరుకొండ, రావులపాలెం, ఆలమూరు, నర్సీపట్నం ప్రాంతాల్లో మరో ఏడు చోరీలకు పాల్పడ్డాడు. లక్ష్మీనరసాపురం చోరీ కేసు దర్యాప్తులో భాగంగా అతను కొప్పవరం బ్రిడ్జి సమీపంలో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు పట్టుకున్నారు. విచారణలో పలు చోరీలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి రూ.58.09 లక్షల విలువైన 385 గ్రాముల బంగారం, 110 గ్రాముల వెండి వస్తువులు, రూ.5 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రేణు అగర్వాల్ దారుణ హత్య

ఎర్రకోటలో భారీ చోరీ…

External Links:

తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *