Ap Heatwave Alert: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు రోజురోజుకు తీవ్రంగా పెరుగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 45.6°C నమోదైంది. నెల్లూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా తీవ్ర ఎండలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 23 జిల్లాల పరిధిలోని 233 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా పల్నాడు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు.
ఇక శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. మొత్తం 71 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, మరో 277 మండలాల్లో సాధారణ వడగాల్పుల ప్రభావం ఉండొచ్చని పేర్కొన్నారు. అలాగే రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎండలు, వడగాల్పుల కారణంగా ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువగా నీరు తాగాలని అధికారులు సూచించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
విషపూరితంగా మారిన కిడ్స్ సిరప్..
SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.
External Links:
ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..