Telangana Medical Colleges

Telangana Medical Colleges: తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మొత్తం 433 పోస్టుల కోసం ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ పరిశీలన హైదరాబాద్‌లోని వెంగల్‌రావు నగర్‌లో ఉన్న IIHFW ప్రాంగణంలో ఈ నెల 22, 23 తేదీల్లో జరగనుంది. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని బోర్డు సూచించింది. ఆ తేదీల్లో రాలేని వారికి ఈ నెల 25న మరో అవకాశం ఇచ్చింది.

గత ఏడాది రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, అనస్తేషియా వంటి కీలక విభాగాల్లో 174 పోస్టుల భర్తీ ఇప్పటికే పూర్తైంది. ఇప్పుడు మిగిలిన 30 విభాగాల్లోని 433 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యాక తుది ఎంపిక జాబితాను విడుదల చేస్తామని బోర్డు తెలిపింది. దీంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత తగ్గి వైద్య సేవలు మెరుగుపడనున్నాయి.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

విషపూరితంగా మారిన కిడ్స్ సిరప్..

SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.

External Links:

మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *