AP SSC Results 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఎస్‌సీ (పదో తరగతి) పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు రాసిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫలితాలు రేపటి నుంచి అధికారికంగా అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూడవచ్చు. అలాగే 9552300009 నంబర్‌కు “Hi” అని వాట్సాప్‌లో మెసేజ్ పంపి, LEAP యాప్ లేదా డిజిలాకర్ ద్వారా కూడా ఫలితాలను పొందే సౌకర్యం కల్పించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ స్కూల్ లాగిన్‌ల ద్వారా ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి ఫలితాలు సాధించిన వారికి అభినందనలు తెలుపుతూ, ఆశించిన ఫలితాలు రాకపోయినా నిరుత్సాహపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి విద్యార్థి విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
విషపూరితంగా మారిన కిడ్స్ సిరప్..
SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.
External Links:
రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..